![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం చిల్డ్రన్స్ డే స్పెషల్ గా ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో మూవీస్ లో, సీరియల్స్ లో నటించే చిన్నపిల్లలతో పాటు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చే చిన్నపిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇక ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు మాస్టర్ ధృవన్ రాజు. ధృవన్ రాజు అంటే తెలియకపోవచ్చు కానీ చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ కొట్టిన సముద్రఖని నటించిన "విమానం" మూవీ పిల్లాడు అంటే యిట్టె తెలిసిపోతుంది. ఇక ఆదిని ఈ కుర్రాడు ఒక రేంజ్ లో ఆడేసుకున్నాడు.
"నువ్వేం చేస్తుంటావ్" అని ఆది అడిగేసరికి "విమానం" అన్నాడు ధృవన్. "ఆ హెలికాప్టర్" ఐతే ఇంటిప్పుడు అన్నాడు ఆది. "నేను నీకంటే గొప్పోడిని" అని ధృవన్ అనేసరికి "నాకంటే గొప్పోడివా ఎలారా" అని ఆది రివర్స్ లో అడిగేసరికి "జబర్దస్త్ లో ఎన్నేళ్లు చేసావ్" అని అడిగేసరికి "జబర్దస్త్ ఏడేళ్ల నుంచి చేస్తున్న" అన్నాడు ఆది. "అనసూయ ఎప్పుడైనా నిన్ను ముద్దు పెట్టుకుందా" అని అడిగాడు ధృవన్ "లేదే" అన్నాడు ఆది. " నేను ఒక్క సినిమానే చేసాను 100 సార్లు ముద్దు పెట్టుకుంది" అన్నాడు ధృవన్. ఇక డ్రామా జూనియర్స్ సీజన్ 6 లో దుమ్ము రేపే పెర్ఫార్మెన్స్ చేసి అందరినీ తనవైపు తిప్పుకున్న లోకేష్ అనే జూనియర్ కూడా ఈ షోకి వచ్చాడు.

"నువ్వెంటి ఇంత అందంగా తయారైవచ్చావ్" అని ఆది అడిగేసరికి "యాంకర్ రష్మీ ఉండగా" అనేసరికి ఐతే అన్నాడు ఆది. "అది కూడా తెలీదారా నీకు, ఎవర్రా నిన్ను శ్రీదేవిలో పెట్టింది" అన్నాడు లోకేష్. ఈ షోలో పిల్లలంతా పోటాపోటీగా అలరించారు. ఆది ఒక్కడే సింగల్ మాన్ షోగా ఈ ఎపిసోడ్ లో కనిపించాడు. నాటీ నరేష్ ని అందరూ కలిసి ఉతికేసి కాసేపు ఫన్ క్రియేట్ చేశారు.
![]() |
![]() |